రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో
డాబాగార్డెన్స్: ఎంవీపీ కాలనీలో గల గాదిరాజు ప్యాలస్ వేదికగా ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు క్రెడాయ్ 11వ ప్రాపర్టీ ఎక్స్‌పో–2025 నిర్వహించనున్నట్టు క్రెడాయ్ చైర్మన్ ధర్మేంద్ర వారాడ, అధ్యక్షుడు ఇ.అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో ప్రాపర్టీ ఎక్స్‌పో–2025 పోస్టర్ ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. గతంలో నిర్వహించిన 10 ప్రాపర్టీ ఎక్స్‌పోలకు మంచి స్పందన వచ్చిందని, అదే స్ఫూర్తితో విశాఖ నగర పౌరుల కోసం 11వ ప్రాపర్టీ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎక్స్‌పోలో క్రెడాయి సభ్యత్వం గల పలు సంస్థలు భాగస్వామ్యం కానున్నాయని, ఎక్స్‌పోలో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్స్‌కు చెందిన పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొని, వినియోగదారులకు తాము అందించే ఆర్థిక సేవలు వివరిస్తారన్నారు. 71 స్టాళ్లలో 50కి పైగా కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించినవి కాగా, మిగిలినవి మెటీరియల్, వివిధ బ్యాంకుల స్టాళ్లు ఉంటాయన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రజలకు అవసరమైన.. అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎక్స్‌పో కన్వీనర్ గోవిందరాజు, గౌరవ కార్యదర్శి వి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


