భారీగా ఎస్‌ఐల బదిలీ
పోలీసుల కళ్లుగప్పి.. ఎట్టకేలకు చిక్కి!
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా భారీగా ఎస్‌ఐల బదిలీలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 118 మంది ఎస్‌ఐలకు స్థానచలనం కలిగించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పరిపాలన సౌలభ్యం నిమిత్తం నగరంలో పలు పోలీస్ స్టేషన్లు, సీసీఆర్‌బీ, సైబర్ క్రైం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 102 మంది ఎస్‌ఐలను, బుధవారం రాత్రి మరో 16 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా ఒకే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నవారు, సీపీకే ఫిర్యాదులు వచ్చినవారికి స్థానం కలిగించినట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం త్రీటౌన్ క్రైం ఎస్‌ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైం ఎస్‌ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రసాద్, ఫోర్తు టౌన్ క్రైం ఎస్‌ఐ విజయ్‌కుమార్, భీమిలీ ఎస్‌ఐ భరత్ కుమార్‌రాజులను రేంజ్‌కి అటాచ్ చేశారు.


