స్టీల్‌ప్లాంట్ ఇన్‌చార్జి సీఎండీకి అభినందనలు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఇన్‌చార్జి సీఎండీగా నియమితులైన సెయిల్ డైరెక్టర్ మనీష్ రాజ్ గుప్తాను ఉక్కు అధికారుల సంఘం (సీ) ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్, సెఫీ చైర్మన్ నరేంద్ర కుమార్ బంచార్, వైస్ చైర్మన్ నరేంద్ర సింగ్‌లు అభినందించారు. బుధవారం వారు న్యూఢిల్లీలోని సెయిల్ కార్యాలయంలో మనీష్ గుప్తాను కలిసి స్టీల్‌ప్లాంట్ గురించి వివరించారు. గత కొన్నేళ్లుగా స్టీల్‌ప్లాంట్ యంత్రాలను, ఉద్యోగులను అలక్ష్యం చేశారని, వాటిని చక్కదిద్దాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ కలిసి పనిచేద్దామని.. తద్వారా విశాఖ ఉక్కుకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


