ప్రత్యేక అలంకరణల్లో గ్రామ దేవతలు
తగరపువలస: భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత రాస పోలమాంబకు 133వ అలంకరణలో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మంగళవారం లిల్లీ, వివిధ రకాల బంతి, తులసి, గజమాలలతో అలంకరించారు. గ్రామంలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. నాలుగేళ్లుగా అమ్మవారిని వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇదే గ్రామానికి చెందిన తుపాకుల అప్పల రాసయ్య, రాసమ్మ దంపతులు భక్తులకు ప్రసాదాలు పంపిణి చేశారు. దివీస్ రహదారిలో మద్దిపేట వద్ద ఆలయంలో ముత్యాలమ్మను వేరుశనగ కాయలు, తోగాలమ్మను ధాన్యం కంకులతో అలంకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, పూజలు చేశారు.
ప్రత్యేక అలంకరణల్లో గ్రామ దేవతలు


