281 ఆక్రమణల తొలగింపు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరిట మంగళవారం 281 ఆక్రమణలు తొలగించినట్టు ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావు తెలిపారు. కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. జోన్–1లో మంగమారిపేట నుంచి భీమిలి బీచ్‌రోడ్డు వరకు 13 ఆక్రమణలు, జోన్–2లో కార్‌షెడ్ జంక్షన్ నుంచి పీఎం పాలెం చివరి బస్టాప్ వరకు 18, జోన్–3లో రామాటాకీస్ నుంచి సత్యం జంక్షన్ వరకు, సత్యం జంక్షన్ నుంచి ఏఎస్‌ఆర్ విగ్రహం వరకు, ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ రోడ్డు నుంచి పోర్టు స్టేడియం వరకు, ఎన్‌ఆర్‌ఐ హాస్పటల్ నుంచి గురుద్వారా జంక్షన్ వరకు 83, జోన్–4లో అగర్వాల్ హాస్పటల్ నుంచి సెయింట్ ఆంతోనీ స్కూల్ వరకు 33, జోన్–5లో అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు నుంచి రైల్వే న్యూకాలనీ వరకు 40, జోన్–6లో బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుంచి దుర్గానగర్ రోడ్డు వరకు, అగనంపూడి జంక్షన్ నుంచి విశాఖ స్టీల్ జనరల్ హాస్పటల్ వరకు 67, వెస్ట్ జోన్‌లో మల్కాపురం నుంచి కోరమండల్ గేట్ వరకు 12, జోన్–8లో వేపగుంట జంక్షన్ నుంచి చినముషిడివాడ వరకు 15 ఆక్రమణలు తొలగించినట్టు చెప్పారు.


