
డుబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
ఏయూక్యాంపస్ : బీచ్‌రోడ్డులో శుక్రవారం హాప్ ఆన్–హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కొద్ది దూరం ప్రయాణించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు దాదాపు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ బస్సులు తిరుగుతాయి.
నగరానికి వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. ఈ బస్సుల్లో ప్రాథమికంగా 24 గంటల ప్రయాణానికి రూ.500 ఉండగా టికెట్ చార్జీలో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుందన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందన్నారు.
విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ శ్రీ భరత్, స్పెషల్ చీఫ్‌సెక్రటరీ అజయ్ జైన్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు షర్టుకు హాప్ ఆన్–హాప్ ఆఫ్ బ్యాడ్జిని జీవీఎంసీ కమిషనర్ కేతన్ అతికించారు.