
ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్న ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్
పరవాడ: స్థిరమైన విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీని అగ్రగామిగా నిలపడంలో విశేష కృషి జరిపిన ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం జరిగిన స్కోప్ ఎమినెన్స్ ఆవార్డుల కార్యక్రమంలో ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్‌కు వ్యక్తిగత నాయకత్వ ఎక్స్‌లెన్స్ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
ఎన్టీపీసీ ఇంధన పరివర్తనను నడిపించడంలోను.. దాని క్లీన్ ఎనర్జీ పోర్ట్‌పోలియోను బలోపేతం చేయడంలోను.. స్థిరమైన విద్యుదుత్పత్తిలో కంపెనీని అగ్రగామిగా నిలబెట్టడడంలో గుర్దీప్ సింగ్ చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.