దివ్యాంగుల సేవలో ఈ.కో.రైల్వే ముందడుగు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సేవలో ఈ.కో.రైల్వే ముందడుగు

Aug 24 2025 9:47 AM | Updated on Aug 24 2025 2:12 PM

దివ్యాంగుల సేవలో ఈ.కో.రైల్వే ముందడుగు

దివ్యాంగుల సేవలో ఈ.కో.రైల్వే ముందడుగు

తాటిచెట్లపాలెం: దివ్యాంగుల కోసం ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే, వాల్తే రు డివిజన్‌ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఎన్‌ఎస్‌జీ–1 నుంచి ఎన్‌ఎస్‌జీ–3 కేటగిరీల కింద ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో దివ్యాంగ సహాయక బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ బూత్‌ల ద్వారా దివ్యాంగులకు అవసరమైన సలహాలు, సహాయం, వీల్‌చైర్లు, ఇతర పరికరాలను ఉచితంగా అందించనున్నారు. ఈ బూత్‌ల నిర్వహణ కోసం దివ్యాంగుల సేవలో ఉన్న స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కోరుతోంది. ఆసక్తిగల స్వచ్ఛంద సంస్థలు తమ సిబ్బందిని ఈ బూత్‌లలో ఉంచి, దివ్యాంగులకు సహాయం అందించాలి. ఎంపికై న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే స్వచ్ఛంద సంస్థలు తమ ఆసక్తిని సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌, వాల్తేరు డివిజన్‌ కార్యాలయంలో అందజేయవచ్చు లేదా watsrdcm@gmail.com మెయిల్‌ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement