సెప్టెంబర్‌ 14న నేషనల్‌ డాగ్‌ షో | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 14న నేషనల్‌ డాగ్‌ షో

Aug 11 2025 7:39 AM | Updated on Aug 11 2025 7:39 AM

సెప్టెంబర్‌ 14న నేషనల్‌ డాగ్‌ షో

సెప్టెంబర్‌ 14న నేషనల్‌ డాగ్‌ షో

మర్రిపాలెం: సెప్టెంబర్‌ 14న నేషనల్‌ డాగ్‌ షో నిర్వహిస్తున్నట్లు విశాఖ కెన్నెల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ సమీపంలోని ఒక ఫంక్షన్‌ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కెన్నెల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంవీపీ గాదిరాజు ప్యాలెస్‌లో ఈ డాగ్‌ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఊటీ, కొడైకెనాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్‌కతా, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ వంటి ప్రాంతాల నుంచి 50 జాతులకు చెందిన 300 కుక్కలు ఈ షోలో పాల్గొంటాయని వివరించారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, రాజేశ్వరరావు, సీరట్ల శ్రీనివాస్‌, సూర్యప్రకాష్‌ రెడ్డి, కృష్ణప్రసాద్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement