డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర కల్పవల్లి కనకమహాలక్ష్మి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదం అందజేశారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శోభారాణి, ఏఈవో రాజేంద్రకుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.