ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
అమర్‌నాథ్, నాగిరెడ్డిని కలిసిన కె.కె.రాజు
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కె.కె.రాజు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పార్టీ మాజీ డిప్యూటీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 9న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశం, అనంతరం పార్టీ అధ్యక్షుడిగా కె.కె.రాజు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, గుడివాడ లతీష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాజాన వెంకటరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మహమ్మద్ గౌస్, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు సేనాపతి అప్పారావు, బోని శివరామకృష్ణ, పులగం కొండారెడ్డి, చిక్కాల సత్యనారాయణ, పార్టీ నాయకులు భూపతిరాజు శ్రీనివాసరాజు, పల్లా పెంటారావు, మంత్రి శంకర నారాయణ, జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


