స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో విద్యుత్‌ టారిఫ్‌ పెంపు | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో విద్యుత్‌ టారిఫ్‌ పెంపు

Published Wed, May 22 2024 6:05 AM

-

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో ఉన్న కార్మికుల విద్యుత్‌ యూనిట్‌ ధర రూ. 8కు పెంచారు. ఈ మేరకు యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో ఉన్న కార్మికులకు త్రైపాక్షిక ఒప్పందం మేరకు యూనిట్‌ ధర 50 పైసలు ఉండేది. ఇటీవల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు యూనిట్‌ ధర రూ. 8కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూనిట్‌ ధర పెంపుపై అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి తమ నిరసన తెలిపాయి. అయినప్పటికీ యూనిట్‌ ధర రూ. 8గా పేర్కొనడం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement