పలు రైళ్ల రద్దు.. రీషెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల రద్దు.. రీషెడ్యూల్‌

Published Thu, Feb 22 2024 12:48 AM

-

తాటిచెట్లపాలెం: పార్వతీపురం–గుమడ స్టేషన్ల మధ్య జరుగుతున్న పనుల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను ఆయా తేదీల్లో రద్దు చేసినట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. మరికొన్ని రైళ్లు రీషెడ్యూల్‌, దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మార్పులు గమనించి ప్రయాణికులు రైల్వేకు సహకరించాలని ఆయన కోరారు.

రద్దు చేసిన రైళ్లు..

ఈ నెల 29 నుంచి మార్చి 5వ తేదీ వరకు విశాఖపట్నం–రాయ్‌పూర్‌–విశాఖపట్నం (08527/08528) పాసింజర్‌ స్పెషల్‌ను ఇరువైపులా రద్దు చేశారు. ఈ నెల 29 నుంచి మార్చి 5వరకు విశాఖపట్నం–భవానీపట్న(08504) స్పెషల్‌, మార్చి ఒకటి నుంచి 5 వరకు భవానీపట్న–విశాఖపట్నం(08503) స్పెషల్‌ పాసింజర్‌, ఈ నెల 29 నుంచి మార్చి 5 వరకు విశాఖపట్నం– కోరాపుట్‌ (08545) పాసింజర్‌ స్పెషల్‌, ఈ నెల 29 నుంచి మార్చి 6 వరకు కోరాపుట్‌–విశాఖపట్నం (08546) పాసింజర్‌ స్పెషల్‌ రద్దయ్యాయి. మార్చి ఒకటి నుంచి 4 వరకు విశాఖపట్నం– కోరాపుట్‌ (18512) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, మార్చి 2 నుంచి 5 వరకు కోరాపుట్‌–విశాఖపట్నం (18511) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.

రీ షెడ్యూల్‌ చేసిన రైళ్లు ఇవే..

● ఈ నెల 29న ఎర్నాకుళం–టాటా (08190) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలు ఆలస్యంగా 9.15 గంటలకు బయలుదేరుతుంది.

● మార్చి ఒకటో తేదీన ఈరోడ్‌– సంబల్‌పూర్‌(08312) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.45 గంటటలకు బయలుదేరుతుంది.

● మార్చి 3న విశాఖపట్నం–లోకమన్యా తిలక్‌ టెర్మినస్‌ (22847) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సుమారు 5.30 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరుతుంది.

● మార్చి 2,4వ తేదీల్లో నాందేడ్‌–సంబల్‌పూర్‌ (208 10) సూపర్‌ఫాస్ట్‌ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు నాందేడ్‌లో బయలుదేరుతుంది.

దారి మళ్లించిన రైళ్లు ఇవే..

● ఈ నెల 28న గాంధీధాం–పూరి (22973) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లించబడిన మార్గంలో వయా టిట్లాఘడ్‌– కేరేజంగా– ఖుర్దారోడ్‌ మీదుగా నడుస్తుంది.

● ఈ నెల 28, మార్చి 3వ తేదీల్లో ఎర్నాకుళం–టాటా(18190) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా విజయనగరం–పలాస–జరోలి–టాటా మీదుగా నడుస్తుంది.

● ఈ నెల 29, మార్చి 3వ తేదీల్లో టాటా–ఎర్నాకుళం (18189) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా టాటా–జరోలి–పలాస–విజయనగరం మీదుగా నడుస్తుంది.

● ఈ నెల 29, మార్చి 2, 3, 5వ తేదీల్లో విశాఖపట్నం–నిజాముద్దీన్‌(12807) సమతా ఎక్స్‌ప్రెస్‌ వయా దువ్వాడ–విజయవాడ–బల్హార్షా మీదుగా నడుస్తుంది.

● ఈ నెల 29, మార్చి 1, 2, 4వ తేదీల్లో నిజాముద్దీన్‌– విశాఖపట్నం(12808) సమతా ఎక్స్‌ప్రెస్‌ వయా బ ల్హార్షా– విజయవాడ–దువ్వాడ మీదుగా నడుస్తుంది.

● ఈ నెల 29, మార్చి 1, 2, 5వ తేదీల్లో పూరి–అహ్మదాబాద్‌ (12843) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా ఖుర్దారోడ్‌– కేరేజంగా– టిట్లాఘడ్‌ మీదుగా నడుస్తుంది.

● ఈ నెల 29, మార్చి 2, 3, 4వ తేదీల్లో అహ్మదాబాద్‌– పూరి (12844) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా టి ట్లాఘడ్‌ –కేరేజంగా– ఖుర్దారోడ్‌ మీదుగా నడుస్తుంది.

● మార్చి 2న పూరి–గాంధీధాం (22974) సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా ఖుర్దారోడ్‌–కేరేజంగా– టిట్లాఘడ్‌ మీదుగా నడుస్తుంది.

Advertisement
 
Advertisement