
బాధితుల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఏసీపీ, సచివాలయ సిబ్బంది
సింహాచలం: అడవివరరంలోని బీఆర్‌టీఎస్ బాధితుల కోసం స్థానిక ఇందిరా ప్రియదర్శినీ కల్యాణ మండపంలో మంగళవారం నుంచి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. తొలిపావంచ నుంచి పాత అడవివరం వరకు ఇటీవల రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను తొలగించారు. ఈ నెల 20న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయుకాంత్‌వర్మ హామీ మేరకు బాధితుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఏసీపీ వెంకటేశ్వరరావు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు సాహితి, మౌనిక బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 10 మంది వినతి పత్రాలు సమర్పించారు. తమకు టీడీఆర్‌లు, నష్టపరిహారం ఇవ్వాలని, పేర్లు మార్చాలని వినతిపత్రాలు సమర్పించిన వారిలో ఉన్నారు.