చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

కేశంపేట: శంషాబాద్‌లోని ఇన్ఫెంట్‌ జీసస్‌ ఇంటర్నేషనల్‌ హైస్కూల్‌లో డిసెంబర్‌ 4, 5 తేదీల్లో జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ నిర్వహించనున్నట్టు జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు సుస్థిర, వికసిత్‌ భారత్‌ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. పోటీల్లో జిల్లాలోని అన్ని జెడ్పీ ఉన్నత పాఠఽశాలలు, ప్రైవేట్‌, కేజీబీవీ, రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ప్రతి పాఠశాల నుంచి వినూత్న ప్రాజెక్టులతో పోటీల్లో పాల్గొనేలా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలల ప్రాజెక్టుల ప్రదర్శనకు ప్రత్యేక గాలరీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టులు అత్యాధునిక, సృజనాత్మకత ఉండేలా చూసుకోవాలన్నారు. వివరాలకు 93953 90985 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు. కడ్తాల్‌: నాగర్‌కరూల్‌ జిల్లా మద్దిమడుగులో ఈనెల 26న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు మంగళవారం వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మార్గమధ్యలో మైసిగండి మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి ఉన్నారు. వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాగతం పలికిన వారిలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌లు ప్రేమజవహర్‌, భిక్షపతి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ జ్యోతి, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: రజనీస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై కడ్తాల్‌కు చెందిన కమ్లికర్‌ రజనీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గత్తర సినిమా షూటింగ్‌ మంగళవారం పట్టణంలో ప్రారంభమైంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి క్లాప్‌కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.

తాండూరు టౌన్‌: చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు చట్టాలను అమల్లోకి తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులకు కనీస వేతనాన్ని రూ.4 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరశిస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ఎదుట జరిగే ఆందోళనకు కార్మిక లోకం తరలిరావాలని కోరుతున్నట్లు చెప్పారు. నాయకులు చంద్రయ్య, రత్నం, రఘుపతి, నరేష్‌, బలరాం, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గోశాల ప్రారంభం

కొడంగల్‌: పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా ఏర్పా టు చేసిన గోశాలను మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, ఆలయ ధర్మకర్తలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాత సంరక్షణ, సేవ, పోషణ ఎంతో పవిత్రమైన కార్య మని నందారం ప్రశాంత్‌ అన్నారు. గోశాల శ్రీవారి ఆలయానికి అనుసంధానంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నందారం రత్నం, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

4,5 తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌

మంత్రి జూపల్లికి

ఘన స్వాగతం

గత్తర సినిమా షూటింగ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement