సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

● రూ.2.5 లక్షల నగదు, బంగారం, భూ పత్రాలు ఆహుతి

దోమ: సిలిండర్‌ పేలి ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన మండలంలోని ఊటుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుధాకర్‌ రెడ్డి నూతన ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రస్తుతం తన పాత ఇంట్లో ఉంటున్నాడు. ఉదయం టీ పెడుతున్న క్రమంలో సిలిండర్‌ ఒక్కసారిగా పేలి భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇళ్లంతా వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన సుధాకర్‌రెడ్డి వెంటనే ఇంట్లోని మరో రెండు సిలిండర్లను బయటకు తీసుకువెళ్లాడు. ఇంట్లోని రూ.2.5 లక్షల నగదు, ఒకటిన్నర తులం బంగారం, భూమికి సంబంధించిన పత్రాలు, ఇతర సామగ్రి కాలి బూడిదైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సుధాకర్‌ రెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement