ఘనంగా ఎల్లమ్మ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఎల్లమ్మ వార్షికోత్సవం

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధి అనంతగిరిపల్లి సమీపంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ మూడో వార్షికోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజాముననుంచి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. 9 గంటలకు గణపతి పూజ, పుణ్యహవచనం, గణపతి నవగ్రహ సుబ్రహ్మణ్య హోమాలు చేపట్టారు. అనంతరం రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం నిర్వహించి,భక్తులకు తీర్థప్రసాదాలు అందించి, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు సునీత చిన్నారావు దంపతులు, సింధూరరాఘవేంద్ర, శ్రీవిద్య, గంగాగీత, నాగండ్ల సుజాత, ఎన్‌వీఎస్‌ చౌదరి, డాక్టర్‌ భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement