వికారాబాద్ వరకుపొడిగించాలని డిమాండ్
నవాబుపేట: వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఎంఎంటీఎస్ రైలు. ప్రస్తుతం నగరం నుంచి లింగంపల్లి వరకు నడుస్తున్న ఈ రైలును జిల్లా కేంద్రం వరకు పొడిగించాలని చాలా ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు కేంద్ర మంత్రులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు కూడా సమర్పించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. వికారాబాద్, చిట్టిగిద్ద, గొల్లగూడ, శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ల నుంచి నిత్యం పది వేల మందికి పైగా ప్రయాణికులు నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగులు ఉంటారు. ఎంఎంటీఎస్ రైలును వికారాబాద్ వరకు పొడిగిస్తే జిల్లా వాసులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇదే విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు విన్నవిస్తూనే ఉన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన సమయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయన్ను కలిసి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగించాలని కోరారు. దీంతో వికారాబాద్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల ప్రజలను రవాణా సౌకర్యం సులభతరమవుతుందని వివరించారు.
పట్టించుకోని అధికారులు
మండల పరిధిలోని చిన్న బ్రిడ్జిలను విస్తరించాలని కొంత కాలంగా పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా రైల్వే శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం మండలంలోని గొల్లగూడ– చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ ఏర్పాటు సందర్భంగా ఆ శాఖ మంత్రి వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు రైల్వే వంతెనలను విస్తరించాలని వినతులు ఇచ్చారు. ఏడాది క్రితం వికారాబాద్‌కు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు కూడా ఎమ్మెల్యే సమస్యను విన్నవించారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వికారాబాద్ పర్యటనలో కూడా సమస్యను తెలియజేశారు. కానీ పరిష్కారం కాలేదు.
పలుమార్లు కేంద్ర మంత్రులకు వినతులు
చిన్న బ్రిడ్జిలతో అవస్థలు
వర్షాలకు స్తంభించిపోతున్న రాకపోకలు
ఇబ్బందుల్లో పలు గ్రామాల ప్రజలు
పట్టించుకోని రైల్వే శాఖ


