కేంద్రం నిధులతోనే
దోమ/కుల్కచర్ల: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. బుధవారం దోమ మండలం మోత్కూర్ గేట్ వద్ద రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్‌ను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ మాట్లాడుతూ.. మల్టీ పర్పస్ సెంటర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆనంద్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ ధనేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శాంతుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వెనుకబడినవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల మండలం రాంపూర్‌లో సర్పంచ్ చెక్కల తిరుపతయ్య ఆధ్వర్యంలో చెంచుల మల్టీపర్పస్ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం, బీజేపీ రాష్ట్ర నాయకుడు మిట్టా పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు చెక్కుల పంపిణీ
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో బుధవారం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి రైతులకు పంట రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మోత్కూర్, రాంపూర్ గ్రామాల్లో మల్టీపర్పస్ భవనాలు ప్రారంభం
పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


