నేడు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ | - | Sakshi
Sakshi News home page

నేడు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

Nov 12 2026 11:42 AM | Updated on Nov 12 2026 11:42 AM

నేడు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు అక్షిత

అనంతగిరి: కొడంగల్‌ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో కాంట్రాక్ట్‌ పద్ధతిన ఫ్యాకల్టీ, ట్యూటర్ల నియామకానికి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూలు వికారాబాద్‌లోని కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరం లేదా రెగ్యూలర్‌ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటివరకు మాత్రమే అమలులో ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు.

కేశంపేట: మండలంలోని కొత్తపేట పీఎంశ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థిని రొయ్యల అక్షిత ఎస్‌జీఎఫ్‌ అండర్‌– 17 విభాగంలో, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా బుధవారం ఎంఈఓ చంద్రశేఖర్‌, పాఠశాల ఉపాధ్యాయులు అక్షితతో పాటు ఆమెకు శిక్షణ ఇచ్చిన పీఈటీ గౌరిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement