ధారూరు: ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు బుధవారం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండోరోజు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తును స్తుతిస్తూ పాటలు పాడారు. భజనలు చేశారు. జాతర ప్రాంగణంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 24 గంటల పాటు సేవలందిస్తున్నారు. సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
తాండూరు: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం తాండూరు ఆర్టీసీ డిపో నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో అధికారులు బుధవారం తెలిపారు. మాలధారులు బస్సులను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. సూపర్ లగ్జరీ నాన్ ఏసీ 36 సీట్ల బస్సుకు కిలో మీటరుకు రూ.59, ఎక్స్‌ప్రెస్ 55 సీట్లకు కిలో మీటరుకు రూ.65, డీలక్స్ 40 సీట్ల బస్సుకు కిలోమీటర్‌కు రూ.57 చొప్పున అద్దె నిర్ణయించడం జరిగిందన్నారు. బస్సు వేచి ఉండే సమయానికి గంటకు రూ.300 చార్జ్ వర్తిస్తుందని, ప్రతి గంటకు 30 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రామాణికంగా పరిగణించనున్నట్లు తెలిపారు. అద్దెలోనే టోల్‌గేట్ చార్జీలు కలిపి ఉంటాయని. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బస్సులను ముందుగా బుక్ చేసుకునేందుకు సెల్ నంబర్ 8309348157, 9959226251, 9440069253 లలో సంప్రదించాలన్నారు.
తాండూరు రూరల్: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని బుధవారం డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు.
తాండూరు టౌన్: పట్టణానికి చెందిన వ్యాపారి శంకర్ యాదవ్ అంతర్జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పలు రంగాల్లో సేవలందించిన వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ అకాడమీ అవార్డులు అందజేస్తోంది. 15 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శంకర్ యాదవ్‌కు ఈ ఏడాది సేవారత్న అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న 20వ బహుజన రైటర్స్ జాతీయ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి రవీంద్ర ఇంద్రజ్ సింగ్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయాధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా శంకర్ యాదవ్ అవార్డు అందుకోనున్నారు. అవార్డు పొందనున్న ఆయనను పలువురు అభినందించారు.
తాండూరు టౌన్: పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలు బుధవారం స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పలు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం కళాశాల సెక్రటరీ పి ఉత్తమ్ చంద్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతుందన్నారు. కృషి, పట్టుదల ఉంటే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులువుగా అందుకోవచ్చన్నారు. వ్యసనాలకు బానిసలు కాకుండా, చదువు, కెరీర్‌పై దృష్టి సారించి జీవితంలో అనుకున్నది సాధించాలన్నారు. తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు, ప్రతిష్టలు తీసు కురావాలన్నారు. అనంతరం గతేడాది పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


