వణికిస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

వణికిస్తోంది..

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

● నగరంలో పెరిగిన చలి ● రాజేంద్రనగర్‌లోఅత్యల్పం 12.5 డిగ్రీలు

● నగరంలో పెరిగిన చలి ● రాజేంద్రనగర్‌లోఅత్యల్పం 12.5 డిగ్రీలు

సాక్షి, సిటీబ్యూరో: మహానగరాన్ని శీతాకాలం గట్టిగా పలకరిస్తోంది. మంగళవారం పటాన్‌చెరులో కనిష్ట ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 2.3 డిగ్రీలు తక్కువ. సగటున గ్రేటర్‌లో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉండగా..శివార్లలో చలి ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. పగటి వేళ మాత్రం వాతావరణం భిన్నంగా కనిపించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికీ 31 నుంచి 32 డిగ్రీల మధ్యే నమోదవుతున్నాయి. కాగా రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వారంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement