ఇబ్రహీంపట్నం: వివాదాస్పదంగా మారిన దండుమైలారం గ్రామ కంఠం భూములపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్మయి, డీపీఓ సురేష్‌కుమార్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికి వెళ్లి ఆ భూములను పరిశీలించారు. ఆక్రమణకు గురైన నాలుగు ఏకరాల 20 గుంటల గ్రామ కంఠం భూమిని కాపాడాలంటూ సర్పంచ్ ఈదులకంటి నరేష్‌గౌడ్ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనకు ధర్మసమాజ్ వ్యవస్థాపకులు విశారదన్మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ భూములపై విచారణ చేపట్టింది. అదనపు కలెక్టర్ గ్రామానికి చేరుకొని సంబంధిత భూములు, రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించారు. 1954 నుంచి పహాణి, పైసల పట్టి రికార్డులను పరిశీలించి, టాంపరింగ్‌పై ఆరా తీశారు. ఈ భూములపై సమగ్ర సర్వే జరిపి, హద్దులను నిర్దారించాలని తహసీల్దార్, సర్వేయర్లను ఆదేశించారు. అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకొని అందులో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారుల విచారణ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
రికార్డులు, మ్యాప్ పరిశీలించిన రంగారెడ్డి యంత్రాంగం


