అనంతగిరి: జర్నలిస్టులకు అన్ని విధాలా అండగా ఉంటానని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర విడదీయలేనిదన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు ఉంచుతారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా ఉందన్నారు. జర్నలిస్టులకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మీ కలం బలమే ప్రజాస్వామ్యానికి బలమని, మీ అనుభవమే మాకు మార్గదర్శకం అన్నారు. మీడియా అంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగో స్తంభం అన్నారు. అనంతరం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విజయంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. వారి సంక్షేమానికి తాను కృషి చేస్తానన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. హక్కుల సాధనకు కృషి చేస్తూ ఇప్పటికీ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొత్తపల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కొండాపూర్ వెంకటేశ్, కోశాధికారిగా వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా నర్సింలు, రాచన్న, మధు గౌడ్, మహేశ్, బాలరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రవీందర్, శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా వెంకటయ్య, శ్రీకాంత్, రాంచందర్, రాములు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షుడిగా పవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రంగరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, టీయూడబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీం, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్


