ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించి, తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో కారణంగా ఆహార, వాణిజ్య పంటలు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కోరారు. పశుగ్రాసం సరఫరా చేయాలని, ప్రతి పేద కుటుంబానికి 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం, సరుకులు సరఫరా చేయాలన్నారు. ఎండిన మొక్కజొన్న, ఇతర వాణిజ్య పంటలను ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు రవీంద్రాచారి, పుస్తకాల నర్సింగ్‌రావు, పానుగంటి పర్వతాలు, ఓరుగంటి యాదయ్య, రామస్వామి, ముత్యాల యాదిరెడ్డి, జంగయ్య, రామకృష్ణ, శేఖర్‌రెడ్డి, ప్రభులింగం, యాదయ్య, నీలమ్మ, శివకుమార్, దత్తు నాయక్, మాధవరెడ్డి, కావలి సురేష్ , షకిల్, మధు తదితరులు పాల్గొన్నారు.


