చిన్నారి జననీ వైద్యానికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి జననీ వైద్యానికి అండగా ఉంటాం

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

మాజీ మంత్రి కేటీఆర్‌ హామీ

కుల్కచర్ల: ఆపదలో ఉన్న చిన్నారి జననీ వైద్యానికి అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మండలంలోని రామరెడ్డిపల్లికి చెందిన నరసింహులు, మల్లమ్మ దంపతుల కుమార్తె జననీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి వైద్యానికి సుమారు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి చిన్నారి కుటుంబ పరిస్థితిని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన జననీకి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శేరి రాంరెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన పీసీసీ నేత

కందుకూరు: పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎనుగు జంగారెడ్డి, శ్రావణిరెడ్డి దంపతులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎం నివాసానికి వెళ్లి దీపావళి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణాలను సీఎం అడిగి తెలుసుకున్నారని జంగారెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారన్నారు.

టీపీఎస్‌ పనుల్లో

వేగం పెంచండి

రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ కిరణ్మయి

మంచాల: తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో చేపట్టిన గదుల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి ఆదేశించారు. పాఠశాలలో కొనసాగుతున్న పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నాణ్యతాప్రమాణాలు పాటించాలని సూచించారు. క్రమంతప్పకుండా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ వెంకట ప్రసాద్‌, ఎంఈఓ రాందాస్‌, నిర్వహణ అధికారి కిషన్‌ చౌహాన్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మహిళలు, పిల్లల భద్రతకు భరోసా

సాక్షి, సిటీబ్యూరో: మహిళలు, బాలల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒకే గొడుగు కింద అన్ని రకాల సేవలు అందించేలా సరికొత్త విభాగం అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలిలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ మహిళా, బాలల భద్రతా విభాగం నూతన భవనాన్ని డీజీపీ సీవీ ఆనంద్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేసే షీ టీమ్స్‌, మానవ అక్రమ రవాణా, భరోసా కేంద్రం, సీడీఈడబ్ల్యూ ఈ నాలుగు కీలక విభాగాలు ఇకపై ఒకే చోట నుంచి మరింత సమర్థవంతంగా సేవలు అందించనున్నాయి. ఈ భవనాన్ని ప్రముఖ వ్యాపార సంస్థ రహేజా గ్రూప్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో నిర్మించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం రమేష్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ జీ సృజన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement