మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

శంకర్‌పల్లి: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని ఫ్యూచర్‌ సిటీ సీపీ తరుణ్‌ జోషి అన్నారు. మండలంలోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో మాదకద్రవ్యాల నిర్మూలన, కట్టడిపై గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సీపీతో పాటు నార్కోటిక్స్‌ డీసీపీ సీతారాం, చేవెళ్ల డీసీపీ యోగేశ్‌, ఇక్ఫాయ్‌ వీసీ ప్రొ. డా. వినయ్‌ కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం డ్రగ్స్‌ని వాడమని, వ్యతిరేకంగా పొరాడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నతనంలోనే డ్రగ్స్‌ వాడకంతో మెదడు పనితీరు నెమ్మదిస్తుందని, జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌పై విరవిగా అవగాహన కల్పించాలని, అమ్మే, కొనే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్‌ రిజిస్ట్రార్‌ విజయలక్ష్మి, డైరెక్టర్‌ డా. వేణుగోపాల్‌రావు, డైరెక్టర్‌ జనరల్‌ ప్రొ. డా.విజయేందర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement