సరూర్‌నగర్‌.. సూపర్‌ | - | Sakshi
Sakshi News home page

సరూర్‌నగర్‌.. సూపర్‌

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

కందుకూరు డివిజన్‌ పరిధిలో..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: సరూర్‌నగర్‌ మండలం పట్టభద్రులకు (18,517) కేంద్రంగా నిలిచింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఓటర్లుగా నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ల జాబితాలో జిల్లాలో ముందు వరుసలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి (12,891), బాలాపూర్‌(10,772), హయత్‌నగర్‌ (9,227) మండలాలు నిలిచాయి. శేరిలింగంపల్లి, మణికొండ, రాజేంద్రనగర్‌ మండలాల్లో ఐటీ, అనుబం ధ కంపెనీలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆయా కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో మెజార్టీ పట్టభద్రులు ఈ పరిసరాల్లోనే స్థిరపడడం ఇందుకు కారణం. అంతేకాదు మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉండటం కూడా ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదు కావడానికి మరో కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు 1,18,617 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ ఓటర్ల తుదిజాబితాను శుక్రవారం సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది. ఆయా మండలాల్లో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

‘పట్నం’లో 27,549 మంది

ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఆరు మండలాలు ఉండగా, వీటిలో 27,549 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. హయత్‌నగర్‌ నుంచి 9,227, ఇబ్రహీంపట్నం 3,983, యాచారం 2,527, అబ్దుల్లాపూర్‌మెట్‌ 7,648, మంచాల 2,334, మాడ్గుల నుంచి 1,830 మంది గ్రాడ్యుయేటర్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను ఏఈఆర్‌ఓ, ఆర్‌ఓ, బీఎల్‌ఓలు పరిశీలిస్తున్నారు. విద్యార్హతకు సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించని వారితో పాటు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన 30 మంది దరఖాస్తులు తిరస్కరించారు.

ఐటీ కారిడార్‌లో 295 రిజెక్ట్‌

రాజేంద్రనగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నాలుగు మండలాలు ఉండగా, వీటిలో మొత్తం 27,242 మంది పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి మండలంలో 12,891 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక గండిపేట నుంచి 5,938, రాజేంద్రనగర్‌ 4,732, శంషాబాద్‌ నుంచి 3,681 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు.

చేవెళ్ల డివిజన్‌ పరిధిలో తక్కువే..

చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నాలుగు మండలాలు ఉండగా, వీటి పరిధిలో 9,204 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇతర డివిజన్లతో పోలిస్తే ఇక్కడ నమోదు కొంత తక్కువగా ఉంది. మొయినాబాద్‌ నుంచి 2,212, చేవెళ్ల 2,958, షాబాద్‌ 1,613, శంకర్‌పల్లి నుంచి 2,421 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 76 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో..

షాద్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆరు మండలాలు ఉండగా, వీటిలో 14,621 మంది పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొందుర్గు నుంచి 1,125, కొత్తూరు 1,434, చౌదరిగూడ 1,049, నందిగామ 1,430, కేశంపేట 2,314, ఫరూఖ్‌నగర్‌ నుంచి 7,269 మంది నమోదు చేసుకున్నారు. వీటిలో ఇప్పటి వరకు 27 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తుది జాబితా వెల్లడించే సమయానికి వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పట్టభద్రుల నమోదు అధికం

తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి, బాలాపూర్‌, హయత్‌నగర్‌ మండలాలు

జిల్లాలో ఇప్పటి వరకు 1,18,617 మంది దరఖాస్తు

నేడు ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల

కందుకూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఏడు మండలాలు ఉండగా, వీటి పరిధిలో 40,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా సరూర్‌నగర్‌ నుంచి 18,517, బాలాపూర్‌ 10,772, ఆమనగల్లు 1,952, కడ్తాల్‌ 1,556, కందుకూరు 2,210, మహేశ్వరం 3,205, తలకొండపల్లి నుంచి 1,789 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన అభ్యర్థులంతా ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 250 అప్లికేషన్లు తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement