యువత, విద్యార్థుల్లో ఆటలపై ఆసక్తి పెంచడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. నిర్వహణను పట్టించుకునే వారు లేకపోవడంతో ఆటలకు దూరమై, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వీటిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు, చిన్నారులకు సంబంధించిన ఆట వస్తువులు ధ్వంసమయ్యాయి. సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి క్రీడా ప్రాంగణాలకు నిధులు కేటాయించి, అందుబాటులోకి తేవాలని స్థానికులు, యువత కోరుతున్నారు.


