రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు గంజాయి స్వాధీనం రేపు నందిగామకు మంత్రి పొంగులేటి రాక పోలీసుల అదుపులో జంట హత్యల నిందితుడు? బాలికతో అసభ్య ప్రవర్తన: కేసు నమోదు మహిళల ఆర్థిక ప్రగతికి కృషి

పూడూరు: కారు – బైక్‌ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌ నుంచి వస్తున్న కారు కోస్గి మండలం నుంచి వస్తున్న బైక్‌ పూడూరు గేటు సమయంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.

మర్పల్లి: పొలాల వద్ద గంజాయితో సంచరిస్తున్న వ్యక్తిని గురువారం మర్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బూచన్‌పల్లికి చెందిన పెంటల జైపాల్‌ ప్లాస్టిక్‌ కవర్‌లో 20 గ్రాముల గంజాయితో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జైపాల్‌కు గంజాయి తీసుకునే అలవాటు ఉన్నట్లు తేలింది. ఎక్కడ నుంచి తెచ్చావని ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన దనసిరి మల్‌రెడ్డి తన పొలంలో ఓ గంజాయి మొక్కను పెంచుతున్నట్లు తెలిపాడు. దీంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు.

షాద్‌నగర్‌: నందిగామ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ఈనెల 7న (శనివారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ భవనం, ఇందిరమ్మ ఇళ్లు, సమాఖ్య భవనం, సెంటర్‌ లైట్ల ప్రారంభోత్సవాలు, నూతనంగా నిర్మించ తలపెట్టిన తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

మీర్‌పేట: సాయివిహార్‌ కాలనీలో బుధవారం జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడు షేక్‌ మహ్మద్‌ సిద్ధిఖ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అత్త, బావమరిది భార్యను హత్య చేసిన అనంతరం కారులో శంషాబాద్‌ వైపు వెళ్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధిఖ్‌ దాడిలో తీవ్రంగా గాయపడి డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బావమరిది యూసుఫ్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, అతని వాంగ్మూలం ఆధారంగా మీర్‌పేట పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేస్టున్నట్లు సమాచారం. విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో సిద్ధిఖ్‌ ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ, దీనిని స్థానిక పోలీసులు నిర్ధారించడం లేదు. పూర్తి విచారణ అనంతరం నిందితుడు అతడిని శుక్రవారం మీడియా ముందు హాజరు పరిచి రిమాండ్‌ చేసే అవకాశం ఉంది.

చేవెళ్ల: బొమ్మలు ఇస్తానని చెప్పి బాలికను ఇంటికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ఓ కాలనీలో ఉండే కుటుంబం కూలీపనులు చేసుకుంటూ జీవిస్తోంది. బుధవారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంటి వద్ద చిన్నారి తమ్ముడితో కలిసి ఉంది. మధ్యాహ్నం సమయంలో అదే కాలనీకి చెందిన నరేశ్‌ (45) బొమ్మలు ఇస్తానని చెప్పి చిన్నారులను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. అదే భవనంలో పై అంతస్తులో ఉన్న ఓ మహిళ గమనించి మందలించడంతో చిన్నారులను పంపించేశాడు. రాత్రి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పటంతో వారు అతనిపై చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: మహిళల ఆర్థిక ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నట్టు రాష్ట్ర జీవనోపాధుల డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌ పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ ద్వారా మంజూరైన నిధులతో పోల్కంపల్లిలో ఏర్పాటు చేసిన గొర్రె పొటెళ్ల పెంపకం షెడ్డు, నాగన్‌పల్లిలో కోడి పిల్లల పెంపకం యూనిట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుని తిరిగి చెల్లించాలని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరంతరం మహిళల అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జీవనోపాధుల ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ నేహ, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ రాజేందర్‌, జిల్లా ఫామ్‌ డీపీఎం నర్సింహ, ఐకేపీ ఏపీఎం సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేశ్‌, ఆనంద్‌, జంగమ్మ, గ్రామ సంఘం అసిస్టెంట్‌లు కవిత, జయలక్ష్మి, అనిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement