పరిగి: సాగు భూములను పరిశ్రమలకు కేటాయించి అభివృద్ధి అనడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ భూ నిర్వాసితులతో కలిసి మంగళవారం పరిగి పట్టణంలోని ఎన్‌కే కన్వెక్షన్ హాల్‌ల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చంద్రయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్కు కోసం టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న భూములన్నీ వందశాతం వ్యవసాయానికి అనుకూలమైనవే అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడం సరికాదన్నారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పే నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలనుకుంటే గతంలో సేకరించిన భూములను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తక్షణమే భూ సేకరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు వెంకటేష్‌గౌడ్, యాదిగౌడ్, రాము లు యాదవ్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చేసిన తప్పే సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారు
టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నర్సింహులు


