తాండూరు: పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్‌బీఓఎల్ సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం వివిధ శాఖల అధికారులను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలతో ఓపికగా మాట్లాడాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం మాతాశిశు ఆస్పత్రిని సందర్శించి వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బంటు వేణుగోపల్, అల్లాపూర్ శ్రీకాంత్, జుంటుపల్లి వెంకట్, బాలకృష్ణారెడ్డి, దివిటి ఎల్లప్ప, మాజీ కౌన్సిలర్ జుబేర్‌లాల, నాయకులు అజయ్‌ప్రసాద్, రాజ్‌కుమార్, రొంపల్లి సంతోష్‌కుమార్, బంటు మల్లప్ప, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి


