గ్రూపు తగాదాలను సహించం | - | Sakshi
Sakshi News home page

గ్రూపు తగాదాలను సహించం

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

తాండూరు: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది గ్రూపు తగాదాలు వీడి పేదల వైద్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం పట్టణంలోని కొడంగల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, మాతాశిశు కేంద్రం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రి అంటే పేదలకు దేవాలయం అని, వైద్య వృత్తి ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత అని అన్నారు. వైద్యులు తమ అనుభవం, నైపుణ్యాన్ని పేదల సేవకు వినియోగించాలన్నారు. విఽధి నిర్వహణలో రోస్టల్‌ పద్ధతి కచ్చితంగా పాటించాలన్నారు. ఓపీ సేవలను నిర్ణీత సమయానికే ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రజామాలిక్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఓటు నమోదుపై దృష్టి పెట్టాలి

పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్‌ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిలపై కాంగ్రెస్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్‌ 6వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌ జాదవ్‌, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పోట్లి మహరాజ్‌ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

పేదల వైద్యంపై దృష్టి సారించండి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

వైద్యులు, సిబ్బందిపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement