అనంతగిరి: భూముల రీ సర్వే ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటాచారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ పంచాయతీ అధికారులు, సర్వేయర్లుకు భూముల రీ సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సర్వే నిర్వహించే సమయంలో భూముల సరిహద్దులు, విస్తీర్ణం, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, సంబంధిత వివరాలను క్షుణంగా పరిశీలించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ ఏడీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వెంకటాచారి


