నేర నియంత్రణకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణకు ప్రాధాన్యత

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

మాట్లాడుతున్న రాజేష్‌ మీనా

అనంతగిరి: క్రైమ్‌ శాఖ సిబ్బంది సమాచార సేకరణలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా సూచించారు. పోలీస్‌ శాఖ లక్ష్యాలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేస్తూ, నేర నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గురువారం ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో క్రైమ్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో జరుగుతున్న నేరాల తీరు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల గుర్తింపు, దొంగతనం కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన పద్ధతులపై సిబ్బందితో చర్చించారు. నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ, దర్యాప్తు అధికారులకు అందించాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు దొంగతనాల నివారణకు పాత నేరస్తుల కదలికలను పర్యవేక్షిస్తూ, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని సమన్వయం చేసుకుని నిందితులను గుర్తించేందుకు కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో సీసీఎస్‌ సీఐ బల్వంత్‌ రాయ్‌, పోలీస్‌ అధికారులు, క్రైమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఏఎస్పీ రాజేష్‌ మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement