నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

అనంతగిరి: విద్యార్థి స్థాయి నుంచే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలని ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజు గుట్టూరు సూచించారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని కేజీబీవీలో 6, 7, 8 తరగతి విద్యార్థులకు దేశ్‌పాండే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్‌ ఇన్‌ విలేజ్‌ ప్రోగ్రాంకు సంబంధించి లెర్నింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభు త్వం అందిస్తున్న ఫలాలను సద్వినియోగం చేసుకు ని ఉన్నతంగా చదవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ ఓ స్వరూప, ఫౌండేషన్‌ నిర్వాహకులు మధు, హేమలతా, శివాని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement