పిడుగుపాటుకు 23 మేకల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 23 మేకల మృత్యువాత

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

రూ.3.50 లక్షల మేర నష్టం

ఆదుకోవాలని బాధిత రైతుల వినతి

బొంరాస్‌పేట/బషీరాబాద్‌: జిల్లాలో పిడుగుపాటు ఘటనల్లో 23 మేకలు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.3.50 లక్షల మేర నష్టం వాటిల్లింది. దుద్యాలకు చెందిన ఓ బాలుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో బుధవారం పిడుగు పడటంతో ఏడు మేకలు మృతి చెందాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైతు మొల్ల యూసుఫ్‌ తన మేకలను మేత కోసం సమీప అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం తోపాటు పిడుగు పడింది. ఏడు జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ రూ.70 వేలకు పైగా ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. దుద్యాలకు చెందిన గడ్డం పెద్ద రాములు తన మేకలను మేతకు తీసుకెళ్లగా పిడుగు పడటంతో 16 జీవాలు చనిపోయాయి. రూ.2.50 లక్షల మేర నష్టం కలిగిందని బాధిత రైతు తెలిపారు. ఆర్‌ఐ నవీన్‌, పశువైద్య సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత రైతును కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు వెంకటయ్య పరామర్శించారు. గ్రామానికి చెందిన సుజాత తన కుమారుడు మధుతో కలిసి పొలం వద్ద రేకుల షెడ్డు ఉంటున్నారు. సెల్‌ఫోన్‌ చూస్తున్న మధు పిడుగు పాటుకు స్పృహ తప్పి పడిపోయాడు. బాలుడిని కోస్గి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement