బాక్సింగ్‌లో సత్తా చాటిన దీప్తి | - | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌లో సత్తా చాటిన దీప్తి

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

అనంతగిరి: జిల్లాకు చెందిన యువ బాక్సర్‌ యెడ్లపల్లి దీప్తి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 16 నుండి 19 వరకు జరిగిన సౌత్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ – 2026 పోటీల్లో కాంస్య పతకం సాధించింది. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 60 – 65 కేజీల ఎలైట్‌ మహిళల విభాగంలో దీప్తి పోటీపడింది. రాష్ట్ర ఛాంపియన్‌ షిప్‌లో ప్రతిభ కనబరిచి సౌత్‌ ఇండియా ఛాంపియన్‌ షిప్‌కు ఎంపికై న దీప్తి, అక్కడ కూడా అద్భుతంగా రాణించి 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. దీప్తి ఎలైట్‌ కిక్‌ బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఆమెకు బాక్సింగ్‌ కోచ్‌లు సంతోష్‌, చైతన్య శిక్షణ ఇస్తున్నారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి పతకం సాధించడం గర్వకారణమని పలువురు అన్నారు. దీప్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement