అక్రమ వెంచర్‌లో రోడ్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

అక్రమ వెంచర్‌లో రోడ్లు ధ్వంసం

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

మొయినాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌లో వేసిన సీసీ రోడ్లను మున్సిపల్‌ అధికారులు ధ్వంసం చేశారు. చిలుకూరు రెవెన్యూలో డైమాండ్‌ గేట్‌ వెంచర్‌లోని కొంత భాగంలో ఇటీవల కొత్తగా లేఅవుట్‌ చేశారు. అందులో వేసిన సిమెంట్‌ రోడ్లను బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి వాణి సిబ్బందితో కలిసి జేసీబీల సాయంతో ధ్వంసం చేశారు. సుమారు రెండు ఎకరాలకు పైగా వేసిన లేఅవుట్‌లోని సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ను పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. 111 జీవో పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేసినా, నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ వెంచర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన ఆదేశాలతో రోడ్లు ధ్వంసం చేసినట్టు తెలిపారు. త్వరలోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు.

ఒకే వెంచర్‌లో రెండోసారి..

ఇదే వెంచర్‌లోని సిమెంటు రోడ్లను నెల రోజుల క్రితమే మున్సిపల్‌ అధికారులు కొంత మేర ధ్వంసం చేశారు. అదే వెంచర్‌లో బుధవారం మళ్లీ రోడ్లు ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులకు ముడుపులు ముట్టనందుకే ఇలా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే వెంచర్‌లో 7,8 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నా వాటి జోలికి వెళ్లని అధికారులు కేవలం వెంచర్‌లోని రోడ్లను మాత్రమే ధ్వంసం చేయడంలో ఆంతర్యమేమిటో అని చర్చించుకుంటున్నారు.

అనుమతి లేని షెడ్ల సీజ్‌

బడంగ్‌పేట్‌: సర్కిల్‌–16 పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న షెడ్లపై అధికారులు బుధవారం చర్యలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్‌ వి.సమ్మయ్య ఆదేశాల మేరకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. సుల్తాన్‌పూర్‌లోని సర్వే నంబర్‌ 60, 61లో, బాలాపూర్‌లోని సర్వే నంబర్‌ 8, 9, 10లో, మల్లాపూర్‌లోని సర్వే నంబర్‌ 2లో అనుమతి తీసుకోకుండా నిర్మిస్తున్న షెడ్లను సీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement