కుల్కచర్ల: బంగారు నగల దుకాణం నిర్వాహకులు తమను మోసం చేసి డబ్బుతో పారిపోయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితులు బుధవారం ఆందోళన చేపట్టారు. మండలంలోని చాపలగూడెం గ్రామానికి చెందిన పగిడ్యాల రాములు బంధువుల పెళ్లి నిమిత్తం పుస్తెల తాడు, నక్లెస్ తయారీ కోసం నాలుగున్న తులాల బంగారం కావాలని మండల కేంద్రంలోని కేసరియా జ్యువెల్లర్స్ నిర్వాహకులు కై లాస్, వికాస్‌తో రూ.6,08,500కు ఒప్పందం చేసుకున్నారు. ముందుగా రూ.4 లక్షలు చెల్లించారు. ఆగస్టు రెండో వారం బంగారు ఆభరణాలు ఇవ్వాలని సూచించారు. దుకాణా నిర్వాహకులు పారిపోవడంతో కుల్కచర్ల పోలీసులకు పిర్యాదు చేశారు. నెలరోజులు కావస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం మార్వాడీల దుకాణాలను బంద్ చేయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే దుకాణాలు తెరవరాదని సూచించారు. సదరు వ్యాపారి కోటి రూపాయలతో పారిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
నెల రోజుల క్రితంపెళ్లి నగల కోసం ఒప్పందం
రూ.6 లక్షలకు గాను
రూ.4 లక్షల చెల్లింపు
డబ్బుతో ఉడాయించిన
బంగారు నగల వ్యాపారులు
దుకాణాలు బంద్ చేయించిన బాధితులు


