27న టీయూడబ్ల్యూ జిల్లా మహాసభ | - | Sakshi
Sakshi News home page

27న టీయూడబ్ల్యూ జిల్లా మహాసభ

Sep 24 2026 7:58 AM | Updated on Sep 24 2026 7:58 AM

అనంతగిరి: సమస్యల పరిష్కారం కోసం ప్రతి జర్నలిస్ట్‌ ఐక్యంగా ముందుకు రావాలని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(హెచ్‌ 143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 27న అల్లం నారాయణ ఆధ్వర్యంలో వికారాబాద్‌లో నిర్వహించనున్న జిల్లా మహాసభకు ప్రతి జర్నలిస్ట్‌ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహాసభకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ ను బుధవారం ఆవిష్కరించారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసి, ఎదురయ్యే సమస్యలను సంఘం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో యూనియన్‌ వికారాబాద్‌ జిల్లా కన్వీనర్‌ రవీందర్‌, నాయకులు జావేద్‌, సంతోష్‌, నరసింహులు, గోపాల్‌, విశ్వనాధ్‌, అమర్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement