● చైర్మన్‌గా ఆశిరెడ్డిగారి రంగారెడ్డి
● వైస్ చైర్మన్‌గా తలారి ప్రభాకర్
నవాబుపేట: వట్టిమీనపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం బుధవారం కొలువుదీరింది. చైర్మన్‌గా ఆశిరెడ్డిగారి రంగారెడ్డి, వైస్ చైర్మన్‌గా తలారి ప్రభాకర్, డైరెక్టర్లుగా జీ ప్రభాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మల్లారెడ్డి, బోజిరెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రకాశం, ఎండీ కదీర్, సత్యమ్మ, మోహనాచారి, మాణేమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడారు. రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేసి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామన్నారు. పీఏసీఎస్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సీఈఓ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన పాలక వర్గాణ్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాథోడ్ గీత సింగ్, మండల అధ్యక్షుడు రావుగారి వెంకట్ రెడ్డి, సర్పంచులు బల్వంత్ రెడ్డి, కిష్టయ్య, సంతోష్ రెడ్డి, శేఖర్, జగన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్స్ నర్సింహారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, పరమేశ్వర్ చారి, విఠల్ రెడ్డి, రాములు, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, మాణిక్యం, జంగయ్య, రవీందర్, మల్లేశం, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


