సంక్షేమానికి కృషి చేయండి
వికారాబాద్: ఎస్సీ, ఎస్టీల సమస్యలపై తక్షణం స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయా శాఖల అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్ర పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. బాధితుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు చనిపోతే వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని సూచించారు. అలాగే బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేయాలన్నారు. పంచాయతీల్లో ఎక్కువ శాతం పారిశుద్ధ్య కార్మికులు ఎస్సీ, ఎస్టీలే ఉన్నరని తెలిపారు. వారికి బీమా చేయించాలని తెలిపారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో ఖర్చు చేయాని అన్నారు. సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తే ఊరుకోబొమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలన్నారు. వీబీజీరామ్‌జీ, అంగన్‌వాడీ, పాఠశాలలు, పంచాయతీల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమలలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డీఓలు వాసుచంద్ర, అనిత తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న బక్కి వెంకటయ్య
సమస్యలపై తక్షణం స్పందించాలి
సబ్‌ప్లాన్ నిధులు పక్కాగా ఖర్చు చేయాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


