సబితారెడ్డిని కలిసిన చేవెళ్ల నేతలు | - | Sakshi
Sakshi News home page

సబితారెడ్డిని కలిసిన చేవెళ్ల నేతలు

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

చేవెళ్ల: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిని చేవెళ్ల బీఆర్‌ఎస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నగరంలోని ఆమె నివాసానికి చేరుకుని పరామర్శించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ సమాజం మండిపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆమెను కలిసిన వారిలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ పి.క్రిష్ణారెడ్డి, గోనె కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కుర్వ మల్లేశ్‌, విజయ్‌భాస్కర్‌రెడ్డి, తలారి యాదయ్య, డీఎం.చందు, వెంకటేశ్వర్‌రెడ్డి, దండు సత్యం, వెంకటేశ్‌, రామగౌడ్‌, క్రిష్ణారెడ్డి, రాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, కృష్ణ, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement