మొయినాబాద్ రూరల్: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో పోలీసుల లాఠీచార్జీ ఎంతవరకు సమంజసమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలో గాయపడిన బీజేవైఎం నాయకుడు శ్రీకాంత్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. ఉద్యమ ఉధృతి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పోరాటం అభినందనీయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, బట్టు జ్ఞానేశ్వర్, రెడ్డిపల్లి సర్పంచ్‌షాపురం రాజు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.


