బొంరాస్‌పేట: దుద్యాల మండలం ఆలేడు, హస్నాబాద్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు మంగళవారం ఎంపీ డీకే అరుణను మహబూబ్‌నగర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలేడు రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద, హస్నా బాద్ బీసీ కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎంపీ సానుకూ లంగా స్పందించినట్లు గ్రామస్తులు తెలిపారు.
టెంకాయల
విక్రయానికి వేలం
పాంబండ ఆలయానికి రూ.2.70 లక్షల ఆదాయం
కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రా వణమాసం సందర్భంగా టెంకాయల విక్ర యానికి మంగళవారం వేలం నిర్వహించారు. బండవెల్కిచర్లకు చెందిన శివప్రసాద్ రూ.2.70 లక్షలకు వేలం హక్కు పొందారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మైపాల్‌రెడ్డి, ఈఓ బాలనర్సయ్య మాట్లాడారు. అందరి సహకా రంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్దన్ రెడ్డి, పూజారి పాండు శర్మ తదితరులు పాల్గొన్నారు.
భూసార పరీక్షలపై విద్యార్థులకు అవగాహన
బొంరాస్‌పేట: విద్యార్థి దశ నుంచే వ్యవసాయ రంగంపై అవగాహన ఉండాలని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నారు. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా మంగళవారం దుద్యాల మండలం చిల్మల్‌మైలారం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేల పరీక్షల విభాగం అధికారులు విజయరత్న, కాలరెన్స్ తదితరులు వ్యవసాయం, నేల ఆరోగ్యం, మట్టి పరీక్షలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. వ్యవసాయాధికారులు సూచించిన మేరకే ఎరువులు వాడాలన్నారు. విద్యార్థులే వ్యవసాయ శాస్త్రవేత్తలు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి తులసి, సర్పంచ్ బాలయ్య, హెచ్‌ఎం యాదయ్య, ఏఈఓ బాబు, ఉపాధ్యాయులు గోవర్ధన్, విజయుడు, అనిల్, హనుమంతులు పాల్గొన్నారు.
ఆ జీఓను రద్దు చేయాలి
మాజీ ఎమ్మెల్యే ఆనంద్
అనంతగిరి: పాలిటెక్నిక్ విద్యార్థులకు ముప్పు గా మారిన జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో జీఓను వ్యతిరేకిస్తూ విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే జీఓను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.


