నిధులు మంజూరు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

నిధులు మంజూరు చేయాలని వినతి

Aug 19 2026 9:10 AM | Updated on Aug 19 2026 9:10 AM

కొడంగల్‌: పట్టణంలో అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ దాము సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరుతో నిర్మిస్తున్న భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దస్తప్ప, అశోక్‌, సాయిలు, రమేష్‌, లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మణ్‌ను కలిసిన

రమేష్‌ కుమార్‌

తాండూరు టౌన్‌: బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ కుమార్‌ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు రమేష్‌ కుమార్‌ చెప్పారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని లక్ష్మణ్‌ సూచించారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణ ముదిరాజ్‌, భద్రేశ్వర్‌, రమేష్‌ సాగర్‌, రాము, నవీన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement