సభా నిర్వహణ దక్కలేదనే ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

సభా నిర్వహణ దక్కలేదనే ఆరోపణలు

Jul 25 2026 7:27 AM | Updated on Jul 25 2026 7:27 AM

షాద్‌నగర్‌రూరల్‌: అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో నిర్వహణ దక్కలేదనే అక్కసుతో ఆరోపణలు చేయడం సరికాదని టీజేఏసీ చైర్మన్‌ జనార్దన్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన టీజేఏసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మారకార్థం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సహకారంతో స్తూపాన్ని నిర్మించి ఆవిష్కరణ చేశారు. దీనికి జేఏసీ నాయకులు రేయింబవళ్లు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఆవిష్కరణ సభా నిర్వహణ ఇవ్వలేదనే అక్కసుతో టీచర్‌ టీజేఏసీ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి టీజేఏసీ చైర్మన్‌పై సమైక్యవాది అని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నానరు. ఉద్యమ సమయంలో టీజేఏసీ సన్నాహాక సమావేశాన్ని ప్రస్తుత టీజేఏసీ చైర్మన్‌ ఇంట్లోనే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. శ్రీధర్‌రెడ్డి ఆరోపణలను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో టీజేఏసీ నాయకులు వెంకటయ్య, శివారెడ్డి, నర్సింలుగౌడ్‌, కృష్ణయ్య, సత్యం, లక్ష్మీదేవమ్మ, కృష్ణ, బాలయ్య, రాములు, అర్జున్‌కుమార్‌, తావుర్యా, బాల్‌రాజ్‌, తిరుమలయ్య, రాము, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement