షాబాద్: హెచ్‌ఎండీఏ వెంచర్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసే దిశగా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ పేర్కొన్నారు. శుక్రవారం షాబాద్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 311లో 290 ఎకరాల భూమి కుమ్మరిగూడ, షాబాద్, సంకేపల్లిగూడ, బోనగిరిపల్లి గ్రామల రైతులకు ఎకరాకు 750 గజాల ప్లాటు చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు లక్కీ డ్రా పద్ధతిలో కేటాయింపు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, ఆర్‌ఐ విజయ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య, సర్పంచులు అశోక్, శ్రీశైలం, లావణ్యచెన్నయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చెన్నయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.


