కుల్కచర్ల: వసతిగృహ విద్యార్థులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కే జనార్దన్ సూచించారు. శుక్రవారం మండలంలోని బండవెల్కిచర్ల, కుల్కచర్ల గ్రామాల్లోని వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే ఉంటారని, వారికి అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో బాలుర వసతిగృహ ప్రత్యేకాధికారి సుందర్‌రాజ్, ఉపాధ్యాయులు రాజేందర్ రాథోడ్, సతీష్, గోపాల్, రమేష్, రాముడు, నర్సింలు, వంశీకృష్ణ, శ్రీకాంత్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జనార్దన్


